హెల్మెట్‌ వాడకంపై అవగాహన

ABN , First Publish Date - 2021-10-30T05:07:43+05:30 IST

పోలీసుల అమరవీరు ల సంస్మరణ దినోత్సవంలో భాగంగా శుక్రవారం పట్టణంలో డిఎస్పీ ఎంవెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో హెల్మెట్‌ వాడకంపై అవగాహన

హెల్మెట్‌ వాడకంపై అవగాహన

ఆత్మకూరు, అక్టోబరు 29 : పోలీసుల అమరవీరు ల సంస్మరణ దినోత్సవంలో భాగంగా శుక్రవారం పట్టణంలో డిఎస్పీ ఎంవెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో హెల్మెట్‌ వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిఽథిగా ఆర్డీవో చైత్రవర్షిణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు మేర హెల్మెట్‌ వాడడం తప్పనిసరని పేర్కొన్నారు. హెల్మెట్‌ వాడడం వల్ల ప్రమాదాల నుంచి బయటపడవచ్చని తెలిపారు. ద్విచక్రవాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు హెల్మెట్‌ ధరించి ఉంటే పాణాపాయం నుంచి తప్పించుకోవచ్చన్నారు. ముందుగా స్థానిక పోలీ్‌సస్టేషన్‌ నుంచి పురవీధుల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్‌ దరిద్దాం..ప్రాణాలు కాపాడుకుందామంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో సీఐ జి.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఐలు సాయిప్రసాద్‌, రాజేష్‌, పోలీస్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T05:07:43+05:30 IST