హెడ్‌కానిస్టేబుల్‌కు పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-01-21T05:07:00+05:30 IST

బ్రెయిన్‌స్ట్రోక్‌తో మంగళవారం రాత్రి మృతి చెందిన ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ 1029 వేణుగోపాల్‌రెడ్డికి బుధవారం నెల్లూరులో శివగిరి కాలనీలోని ఆయన నివాసం వద్ద పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

హెడ్‌కానిస్టేబుల్‌కు పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు
వేణుగోపాల్‌ రెడ్డి పార్థివ దేహానికి సెల్యూట్‌ చేస్తున్న ఏఎస్పీ వెంకటరత్నం

నెల్లూరు(క్రైం), జనవరి 20: బ్రెయిన్‌స్ట్రోక్‌తో మంగళవారం రాత్రి మృతి చెందిన ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ 1029 వేణుగోపాల్‌రెడ్డికి బుధవారం నెల్లూరులో శివగిరి కాలనీలోని ఆయన నివాసం వద్ద పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వేణుగోపాల రెడ్డి మృతదేహాన్ని ఏఎస్పీలు పీ వెంకటరత్నం, వీరభద్రుడు సందర్శించారు.  సెల్యూట్‌ చేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ వేణుగోపాల్‌రెడ్డి ఉన్నతాధికా రుల ఆదేశాలను పాటిస్తూ రాజీపడకుండా విధులు నిర్వహించే వారన్నారు. పోలీసుశాఖ ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గాంధీ, అడ్మిన్‌ ఆర్‌ఐ శ్రీనివాసులురెడ్డి, వెల్ఫేర్‌ ఆర్‌ఐ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T05:07:00+05:30 IST