ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్యాయత్నం
ABN , First Publish Date - 2021-10-26T03:32:30+05:30 IST
hatyayatnam భూమి వివాదంలో ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డ వైనమిది. ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యా

తోటపల్లిగూడూరు, అక్టోబరు 25 : భూమి వివాదంలో ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డ వైనమిది. ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు, మండలంలోని పేడూరుకి చెందిన పావురాయల మధును, అదే గ్రామానికి చెందిన పోసిన వెంకట రమణ య్య ట్రాక్టర్‌తో ఢీ కొట్టి హత్య చేసేందుకు యత్నించాడు. పొలం వివాదం విషయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు మధు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-------------------------------