గూడూరులో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-08-11T03:10:43+05:30 IST

గూడూరులో మంగళవారం వేకువన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వేకువ నుంచి ఉదయం 8 గంటల వరకు ఎడతె

గూడూరులో భారీ వర్షం
గూడూరు ఏఏరెడ్డి స్టేడియంలో వర్షానికి నిల్వచేరిన నీరు

గూడూరురూరల్‌, ఆగస్టు 10: గూడూరులో మంగళవారం వేకువన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వేకువ నుంచి ఉదయం 8 గంటల వరకు ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. వారం రోజులుగా ఎండతీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. వర్షం కురిసి వాతావరణం చల్లబడడంతో సేద తీరారు. వర్షం కారణంగా పలు రోడ్లు జలమయంగా మారడంతో వాహనదారులు, పాదచారులు అవస్థలు పడ్డారు. 


Updated Date - 2021-08-11T03:10:43+05:30 IST