గౌరవరంలో క్షుద్రపూజల ఆనవాళ్లు

ABN , First Publish Date - 2021-06-23T03:21:51+05:30 IST

మండలంలోని గౌరవరం గ్రామ శివారు ప్రాంతంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు మంగళవారం కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందారు.

గౌరవరంలో క్షుద్రపూజల ఆనవాళ్లు
పూజలు చేసిన ప్రాంతంలో ఉన్న వస్తువులు

భయాందోళనలో ప్రజలు

అనంతసాగరం, జూన్‌ 22: మండలంలోని గౌరవరం గ్రామ శివారు ప్రాంతంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు మంగళవారం కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. ఈ విషయంపై తీవ్ర చర్చనీయాంశం అయిది. పూజలు చేసిన ప్రాంతంలో కాల్సిన కోడి, టెంకాయ, కుంకుమ, నిమ్మకాయలు ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఇది క్షుద్రపూజ, లేక ఎవరైన దిష్టి తీశారా? అనే కోణంలో అనుమానాలు వక్తమవుతున్నాయి. ఇలాంటి పూజలు మర్రిపాడులో కూడా ఇటీవల చేసినట్లు చర్చ జరుగుతుంది. ఈ పూజలు చేయడం వెనుక అసలు విషయం ఏమిటో అర్థం కాని స్థానికులు అనంతసాగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Updated Date - 2021-06-23T03:21:51+05:30 IST