వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
ABN , First Publish Date - 2021-12-16T04:17:13+05:30 IST
ఇటీవల సంభవించిన వరదల సమయంలో సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా కార్యవర్గం తీర్మానించింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్ యాదవ్ అధ్యక్షతన బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యవర్గ సమావేశం జరిగింది.

బీజేపీ జిల్లా కార్యవర్గం తీర్మానం
నెల్లూరు(స్టొన్‌హౌస్‌పేట), డిసెంబరు 15: ఇటీవల సంభవించిన వరదల సమయంలో సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా కార్యవర్గం తీర్మానించింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్ యాదవ్ అధ్యక్షతన బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యవర్గ సమావేశం జరిగింది. కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ జలాశయాల్లో వరదనీటి నిర్వహణలో వైఫల్యం వల్లనే జిల్లా తీవ్రంగా నష్టపోయిందన్నారు. వరి, మెట్ట పంటలు, ఉద్యాన పంటల రైతులు, ఆక్వా సాగుదారులు భారీగా నష్టపోయారన్నారు. అన్ని రంగాల్లో కలిపి రూ.2వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు. వరద తాకిడికి గురైన 50 వేల గృహాలకు రూ.10వేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన పంటల బీమా పథకాన్ని జగన్ సర్కార్ నిర్వీర్యం చేసిందని, దీని వల్ల వరదలు, వర్షాల సమయంలో నష్టపోయిన రైతులు బీమా సదుపాయం కోల్పోయార న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి రఘురామిరెడ్డి, నేతలు కాకు విజయలక్ష్మి, కర్నాటి ఆంజనేయరెడ్డి, మిడతల రమేష్, మండ్ల ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ రిటైర్డు ఉద్యోగుల వరద సాయం
నెల్లూరు(హరనాథపురం), డిసెంబరు 15 : వరద బాధితులకు సహాయం అందించా లని రెవెన్యూ శాఖ రిటైర్డు ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు బుధవారం కలెక్టర్ చక్రధర్‌బాబుకు రూ.50 వేల విలువైన 400 దుప్పట్లను అందచేశారు. దాతలను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ముత్యం నరసింహులు, వేలూరు శ్రీనివాసులు, వరిగొండ కృష్ణారావు పాల్గొన్నారు.
