సురక్షితమైన తాగునీటిని వినియోగించండి

ABN , First Publish Date - 2021-11-24T05:01:49+05:30 IST

భారీ వర్షాలు, వాతావరణ మార్పులతో సీజన్‌ వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉన్నందున ప్రజలంతా సురక్షితమైన తాగునీటిని వినియోగించుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ నరేంద్రకుమార్‌ తెలిపారు.

సురక్షితమైన తాగునీటిని వినియోగించండి

మున్సిపల్‌ కమిషనర్‌ నరేంద్రకుమార్‌

సూళ్లూరుపేట, నవంబరు 23 : భారీ వర్షాలు, వాతావరణ మార్పులతో సీజన్‌ వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉన్నందున ప్రజలంతా సురక్షితమైన తాగునీటిని వినియోగించుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ నరేంద్రకుమార్‌ తెలిపారు. మంగళ వారం కోళ్లమిట్ట, పందలగుంట సచివాలయాల్లో వైద్యశిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రోగులకు మందులను పంపిణీ చేస్తూ పలు సూచనలు చేశారు.  కమిషనర్‌ మాట్లాడుతూ కాచి వడకట్టిన నీటినే తాగాలని, వేడి ఆహారాన్ని  తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆయనతోపాటు పలువురు వైద్య అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-11-24T05:01:49+05:30 IST