యువతకు సముచిత స్థానం

ABN , First Publish Date - 2021-08-21T03:22:58+05:30 IST

నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యల పరిష్కా రానికి పోరాడే యువతకు తెలుగుదేశంపార్టీలో సముచితస్థానం కల్పించినట్లు సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు.

యువతకు సముచిత స్థానం
నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవలకు పుష్పగుచ్చం అందజేస్తున్న అవధానం సుధీర్‌

నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల 

నాయుడుపేట,  ఆగస్టు 20 : నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యల పరిష్కా రానికి పోరాడే యువతకు తెలుగుదేశంపార్టీలో సముచితస్థానం కల్పించినట్లు సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. నాయుడుపేట పట్టణవాసి అవధానం సుధీర్‌ తిరుపతి పార్లమెంట్‌ తెలుగుయువత ఉపాధ్యక్షుడిగా ఎంపికకావడంతో పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం  నెలవల  ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెలుగు యువత సభ్యులు ప్రసాద్‌, గోపాల్‌, విష్ణు, హరి, దార్ల రాజేంద్ర, హేమంత్‌, పునీత్‌, సాయి, చెంగయ్య  ఉన్నారు.
Updated Date - 2021-08-21T03:22:58+05:30 IST