తల్లి మరణాన్ని తట్టుకోలేక బాలిక ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-20T05:03:07+05:30 IST

అన్నిటికీ ఆధారమైన అమ్మే లేనప్పుడు నేను కూడా ఈ లోకంలో ఉండను.... అమ్మా నీదగ్గరికే వచ్చేస్తున్నా... అని తల్లి మరణాన్ని తట్టుకోలేక ఓ బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

తల్లి మరణాన్ని తట్టుకోలేక  బాలిక ఆత్మహత్య

నెల్లూరు(క్రైం), డిసెంబరు 19: అన్నిటికీ ఆధారమైన అమ్మే లేనప్పుడు నేను కూడా ఈ లోకంలో ఉండను.... అమ్మా నీదగ్గరికే వచ్చేస్తున్నా... అని తల్లి మరణాన్ని తట్టుకోలేక ఓ బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... నెల్లూరులోని నవాబుపేట ప్రాంతంలో కార్తీక్‌రాజు కుటుంబం నివసిస్తోంది. ఐదు నెలల క్రితం కార్తీక్‌రాజు భార్య అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఇంటర్మీడియట్‌ చదువుతున్న వారి కుమార్తె సర్వేపల్లి అక్షయ(16) తీవ్ర మనోవేదనకు గురైంది. నిత్యం తల్లిని గుర్తు చేసుకుంటూ, నిద్రలోనూ తల్లినే కలవరిస్తూ.... తాను కూడా అమ్మ దగ్గరికి వెళ్లిపోతా అని చెబుతూ ఉండేది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఫ్యానుకు చున్నీతో ఉరివేసుకుంది. గుర్తించిన తండ్రి హుటాహుటిన వైద్యశాలకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. నవాబుపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-20T05:03:07+05:30 IST