చిన్నారికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన మహిళ

ABN , First Publish Date - 2021-01-14T04:25:50+05:30 IST

పట్టణంలోని మూకాంబికా గుడి వీధిలో పిల్లలతో ఆడుకుంటున్న ఓ చిన్నారికి మాయమాటలు చెప్పి ఓ మహిళ తీసుకువెళ్లిన సంఘటన బుధవారం నాయుడుపేటలో చోటుచేసు కుంది.

చిన్నారికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన మహిళ

నాయుడుపేట టౌన్‌, జనవరి 13 : పట్టణంలోని మూకాంబికా గుడి వీధిలో పిల్లలతో ఆడుకుంటున్న ఓ చిన్నారికి మాయమాటలు చెప్పి ఓ మహిళ తీసుకువెళ్లిన సంఘటన బుధవారం నాయుడుపేటలో చోటుచేసు కుంది. సంక్రాంతి పండుగ కావడంతో చిన్నారులంతా ఆటలాడుతుండగా అదే సమయంలో వారి దగ్గరకు లక్ష్మి అనే మహిళ వచ్చి ఓ చిన్నారిని దగ్గరకు పిలిచి చాక్లెట్‌లు ఇచ్చింది. అనంతరం  అక్కడ నుంచి ఆ చిన్నారిని తనతో తీసుకొని సమీపంలో ఉన్న కూరగాయల మార్కెట్‌ వద్దకు రాగానే గుర్తించిన స్థానికులు ఆ మహిళను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకొని ఆ మహిళను పోలీసులకు అప్పగించారు.  

Updated Date - 2021-01-14T04:25:50+05:30 IST