గిరిజనులకు ఉచిత న్యాయసేవలు
ABN , First Publish Date - 2021-10-30T03:21:23+05:30 IST
గిరిజనులకు ఉచితంగా న్యాయ సేవలు అందించడం జరుగుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం. శ్రీనివాసులు నాయక్ పేర్కొన్నారు.

న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు నాయక్
వెంకటాచలం, అక్టోబరు 29 : గిరిజనులకు ఉచితంగా న్యాయ సేవలు అందించడం జరుగుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం. శ్రీనివాసులు నాయక్ పేర్కొన్నారు. మండలంలోని చవటపాళెం పంచాయతీ ఎర్రగుంట, వెంకటాచలం గ్రామాల్లోని ఎస్టీ కాలనీల్లో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు నాయక్ విచ్చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరు సమాజం పట్ల నిబద్ధత కలిగి ఉండాలని సూచించారు. గిరిజనులు చట్టాలపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరమన్నారు. పేదలు న్యాయసేవాధికార సంస్థ ద్వారా న్యాయస్థానంలో సలహాలు పొందవచ్చన్నారు. అలాగే వెంకటాచలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చట్టాల గురించి ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు.