మరో చిన్నారి మృతి

ABN , First Publish Date - 2021-08-26T05:29:55+05:30 IST

ఏఎస్‌పేట ఖాజా రహమతుల్లా నాయబే రసూల్‌ దర్గా దగ్గర మహల్‌కు సమీపంలో ప్రహరీ ఇను ప గేటు కూలిన ఘటనలో చికిత్సపొందుతూ మరో

మరో చిన్నారి మృతి

ఏఎస్‌పేట, ఆగస్టు 25: ఏఎస్‌పేట ఖాజా రహమతుల్లా నాయబే రసూల్‌ దర్గా దగ్గర మహల్‌కు సమీపంలో ప్రహరీ ఇను ప గేటు కూలిన ఘటనలో చికిత్సపొందుతూ మరో చిన్నారి అలీనా (2) బుధవారం మృతిచెందింది. బీహార్‌ రాష్ట్రం నుంచి దర్గాకు వచ్చి గది అద్దెకు తీసుకుని కూలి పనులు చేసుకుంటూ రఫీ, తమన్నాల కుటుంబం నలుగురు పిల్లలతో ఇక్కడే ఉంటు న్నారు. అయితే సోమవారం రాత్రి ప్రహరీ దిమ్మెతో పాటు ఇనుప గేటు కూలి కుమార్తె రాణి (9) మృతిచెందగా తీవ్రంగా గాయపడ్డ మరో చిన్నారి అలీనా(2)ని నెల్లూరు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి అలీనా బుధవారం మృతిచెందింది. ఒకరోజు వ్యవధిలో అక్కా చెల్లెళ్లు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవు తున్నారు. దేవుడు చల్లగా చూస్తాడని ఇంతదూరం నుంచి వస్తే కడుపు కోత మిగిల్చావా అని రోదిస్తున్నారు. ఎస్‌ఐ సుబహని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-26T05:29:55+05:30 IST