ఉత్తమ ఉపాధి కోర్సు డీసీసీపీ

ABN , First Publish Date - 2021-11-01T04:48:09+05:30 IST

పాలిటెక్నిక్‌లో డిప్లమో ఇన్‌ కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌ (డీసీసీపీ) కోర్సు మెండుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని నెల్లూరు వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ప్రిన్సిపాల్‌ జి.సుధాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఉత్తమ ఉపాధి కోర్సు డీసీసీపీ

అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

నెల్లూరు (విద్య) అక్టోబరు 31 : పాలిటెక్నిక్‌లో డిప్లమో ఇన్‌ కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌ (డీసీసీపీ) కోర్సు మెండుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని నెల్లూరు వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ప్రిన్సిపాల్‌ జి.సుధాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి ఉత్తీర్ణులైన వారు, పాలీసెట్‌ ఎంట్రన్స్‌ రాయని వారు, ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులు కూడా ఈ కోర్సుకు అర్హులేనని పేర్కొన్నారు.  విద్యార్థులకు వెంటనే ఉపాధి కల్పించే ఈ కోర్సులో కంప్యూటర్‌ సబ్జెక్ట్‌, ఎంఎస్‌ఆఫీస్‌, మల్టీమీడియా, పి ప్రోగ్రామింగ్‌ టాలీ, కామర్స్‌, అనలటికల్‌, ఇంగ్లీష్‌ కమ్యూనికేషన్‌, లైఫ్‌ స్కిల్స్‌, ఫీల్డ్‌ ప్రాక్టీస్‌, ఇంగ్లీష్‌ షార్ట్‌ హ్యాండ్‌, టైప్‌ రైటింగ్‌లలో శిక్షణ ఇస్తారని తెలిపారు.  హాస్టల్‌ వసతి ఉందని పేర్కొన్నారు. మూడేళ్ల కోర్సు పూర్తిచేసిన వారికి అన్ని రంగాల్లోనూ ఉద్యోగావకాశాలు ఉన్నాయని తెలిపారు. రైల్వేస్‌, ఇంటెలిజెన్స్‌, బ్యాంకులు, ఎయిర్‌ఫోర్స్‌, డిఫెన్స్‌ కార్యాలయాల్లో అధిక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఏపీపీఎస్‌సీఈ, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకు పరీక్షల ద్వారా పర్సనల్‌ సెక్రటరీ, జిల్లాలో షార్‌, జిల్లా కోర్టు, కృష్ణపట్నం పోర్టు, శ్రీసిటీ తోపాటు అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారు బి.కాం లో నేరుగా సెకండియర్‌లో చేరవచ్చునని తెలిపారు. తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచించి తమ పిల్లలను ఈ కోర్సులో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు  బాటలు వేయాలని కోరారు. ఆసక్తి గల విద్యార్థులు తమ సర్టిఫికెట్లతో వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల డీసీసీపీ సెక్షన్‌లో హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు డీసీసీపీ శాఖాధిపతి డాక్టర్‌ ఎన్‌.ఉషారాణి, 9490560175, 9441190077, 9490560130లను సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2021-11-01T04:48:09+05:30 IST