ఆనందయ్య ఆయుర్వేదానికి అడ్డం పడొద్దు: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2021-05-20T19:19:39+05:30 IST

ఆనందయ్య ఆయుర్వేదం మందుకు అడ్డం పడొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వినతి చేశారు.

ఆనందయ్య ఆయుర్వేదానికి అడ్డం పడొద్దు: సోమిరెడ్డి

నెల్లూరు: ఆనందయ్య ఆయుర్వేదం మందుకు అడ్డం పడొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వినతి చేశారు. కృష్ణపట్నంకు చెందిన బొనిగి ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదం మందుతో కోవిడ్ నయమవుతోందన్నారు. ఆనందయ్య కుటుంబం దశాబ్దాలుగా ఆయుర్వేద మందులు ఉచితంగా అందజేస్తోందని తెలిపారు. కోవిడ్ కోసం తయారు చేసిన మందును ఇప్పటి వరకు 70 వేల మందికి ఇచ్చారని..ఏ ఒక్కరి నుంచి నెగటివ్ రిపోర్ట్ లేదని చెప్పారు. ఇలాంటి ఉపయోగకరమైన మందు పంపిణీని అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. 

Updated Date - 2021-05-20T19:19:39+05:30 IST