తగ్గిన వరద ప్రవాహం

ABN , First Publish Date - 2021-12-08T04:28:47+05:30 IST

సంగం ఆనకట్టకు వరద ప్రవాహం బాగా తగ్గి మంగళవారం సాధారణ స్థితికి వచ్చింది.

తగ్గిన వరద ప్రవాహం

సంగం, డిసెంబరు 7: సంగం ఆనకట్టకు వరద ప్రవాహం బాగా తగ్గి మంగళవారం సాధారణ స్థితికి వచ్చింది. ప్రస్తుతం ఆనకట్టకు సుమారు 9 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో నీటిమట్టం ఆనకట్ట మట్టం కంటే కేవలం నాలుగు అంగుళాలు ఉంది. వారధిపై నాలుగు అగుళాలు ప్రవహిస్తోంది. వారధిపై బాగా పాచిపట్టి జారుతుండడంతో గేటు తాళాలు తీయలేదు. ఆనకట్టపై జేసీబీతో కంప మండలు లాగి పాచి తొలగించిన తరువాత రాకపోకలు పునరుద్ధరించనున్నారు.

Updated Date - 2021-12-08T04:28:47+05:30 IST