5 లీటర్ల నాటు సారా పట్టివేత

ABN , First Publish Date - 2021-01-13T05:03:23+05:30 IST

మండలంలోని దేవరపాళెంలో ఓ వ్యక్తి నుంచి 5 లీటర్ల నాటు సారాను సెబ్‌ నెల్లూరు రూరల్‌ అధికారులు మంగళవారం పట్టుకున్నారు.

5 లీటర్ల నాటు సారా పట్టివేత

నెల్లూరు రూరల్‌, జనవరి 12 : మండలంలోని దేవరపాళెంలో ఓ వ్యక్తి నుంచి 5 లీటర్ల నాటు సారాను సెబ్‌ నెల్లూరు రూరల్‌ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. దేవరపాళెంలోని ఐఎంఎల్‌ డిపో సమీపాన అటవీ ప్రాంతానికి దగ్గర్లో నాగలూరు నరేంద్ర అక్రమంగా నాటు సారా కాస్తున్నట్లు సమాచారం అందిందని సెబ్‌ సీఐ సూర్యనారాయణ  తెలిపారు. దీంతో దాడిచేసి నిందితుడిని పట్టుకున్నామన్నారు. అతను కడపకు చెందిన వ్యక్తిగా గుర్తించామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  

Updated Date - 2021-01-13T05:03:23+05:30 IST