విద్యార్థులకు దేహదారుఢ్య పరీక్షలు

ABN , First Publish Date - 2021-12-31T04:32:01+05:30 IST

క్రీడా పాఠశాలల్లో ప్రవేశం కల్పించేందుకు గురువారం చిట్టేడు యానాదుల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు యానాదుల సంక్షేమ గురుకుల విద్యాలయాల జిల్లా కన్వీనర్‌ కౌండిన్యసాయి, స్థానిక ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి ఆధ్వర్యంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు.

విద్యార్థులకు దేహదారుఢ్య పరీక్షలు
దేహధారుఢ్య పరీక్షను ప్రారంభిస్తున్న ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి తదితరులు

కోట, డిసెంబరు 30 :  క్రీడా పాఠశాలల్లో ప్రవేశం కల్పించేందుకు గురువారం చిట్టేడు యానాదుల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు యానాదుల సంక్షేమ  గురుకుల విద్యాలయాల జిల్లా కన్వీనర్‌ కౌండిన్యసాయి, స్థానిక ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి ఆధ్వర్యంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 11 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరు జనవరి 4న తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో జరిగే రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ రామిరెడ్డి, పీడీ కార్తిక్‌రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు. 


Updated Date - 2021-12-31T04:32:01+05:30 IST