ఎర్రచెరువులో మత్స్య సంపద దోపిడీ

ABN , First Publish Date - 2021-05-30T05:54:41+05:30 IST

ప్రభుత్వానికి జమ చేయాల్సిన లీజు నగదు ట్రెజరీలో చెల్లించ కుండానే నిబంధనలకు విరుద్ధంగా చేపల వేట జరుగుతున్న వైనం శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

ఎర్రచెరువులో మత్స్య సంపద దోపిడీ

లీజు నగదు చెల్లించకుండానే చేపల వేట

అధికారుల మీనమేషాలు

అన ంతసాగరం, మే 29: ప్రభుత్వానికి జమ చేయాల్సిన లీజు నగదు ట్రెజరీలో చెల్లించ కుండానే నిబంధనలకు విరుద్ధంగా చేపల వేట జరుగుతున్న వైనం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అనంతసాగరం మండలం పీకేపాడు పంచాయతీ ఎర్రచెరువులో చేపల వేట చేసుకునేందుకు గతంలో పంచాయతీ అధికారులు వేలం నిర్వహించారు. ఓ కాంట్రాక్టర్‌ రూ.4.10 లక్షలకు చెరువును వేలం ద్వారా దక్కించుకున్నాడు. అయితే ఈ నగదు పంచాయతీ కార్యదర్శి ద్వారా ట్రెజరీకి చెల్లించి ఆ తరువాత చేపల వేట నిర్వహించాల్సి ఉండగా కాంట్రాక్టర్‌ నగదు చెల్లించకపోయినా వేట చేసుకునేలా అధికారులు ప్రోత్సహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శనివారం నుంచి చెరువులో చేపల వేట చేస్తుంటే పట్టించుకోవటం వారు వాపోయారు. చెరువు లీజు వచ్చే జూన్‌ మాసం వరకు మాత్రమే ఉంది. చెరువులోని మత్స్యసంపద కొల్లగొట్టేందుకు చేస్తున్న ఈ చర్యలపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-05-30T05:54:41+05:30 IST