అగ్ని ప్రమాదంలో రెండు ఇళ్లు దగ్ధం

ABN , First Publish Date - 2021-06-22T04:34:56+05:30 IST

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.10లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు.

అగ్ని ప్రమాదంలో రెండు ఇళ్లు దగ్ధం
అగ్ని ప్రమాదంలో కాలిపోయిన వస్తువులు

 తోటపల్లిగూడూరు, జూన్‌ 21 : విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.10లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. మండలంలోని వరకవిపూడి గిరిజన కాలనీలో సోమవారం సంభవించిన విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా యాటగిరి పోలయ్యకు చెందిన పూరింటికి మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు పక్కనే ఉన్న ఏడుకొండలు అనే వ్యక్తి ఇంటికి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పోలయ్య పూరిల్లు పూర్తిగా దగ్ధం కాగా.. ఏడుకొండలు ఇంట్లో ఉన్న సుమారు రూ.8లక్షల విలువైన వస్తు సామగ్రి మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహూటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.  లేకపోతే మరింత నష్టం జరిగేదని  స్థానికులు తెలిపారు.  

Updated Date - 2021-06-22T04:34:56+05:30 IST