ఫివర్‌ సర్వేని తనిఖీ చేసిన ఆర్డీవో

ABN , First Publish Date - 2021-05-31T04:05:58+05:30 IST

మండలంలోని సున్నంవారిచింతల గ్రామంలో జరుగుతున్న ఫివర్‌ సర్వే కార్యక్రమాన్ని ఆదివారం ఆత్మకూరు ఆర్డీవో చైత్రవర్షిణి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఫివర్‌ సర్వేని తనిఖీ చేసిన ఆర్డీవో
సర్వే వివరాలు తెలుసుకుంటున్న ఆర్డీవో చైత్రవర్షిణి

ఉదయగిరి రూరల్‌, మే 30: మండలంలోని సున్నంవారిచింతల గ్రామంలో జరుగుతున్న ఫివర్‌ సర్వే కార్యక్రమాన్ని ఆదివారం ఆత్మకూరు ఆర్డీవో చైత్రవర్షిణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వేలో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, గ్రామ వలంటీర్లు పాల్గొంటున్నారా అని ఆరా తీశారు. పకడ్బందీగా సర్వే చేపట్టాలని, తూతూమంత్రంగా సర్వే చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గ్రామంలో పలు నివాసాలకు వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే వింజమూరులో కొవిడ్‌ కేంద్రాన్ని, ఫివర్‌ సర్వే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారులు శ్రీకళ, హరికృష్ణ, తహసీల్దారు సుధాకర్‌రావు, ఎంపీడీవో కనకదుర్గాభవానీ, వైద్యఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

జ్వరాల సర్వే 96 శాతం పూర్తి 

మండలంలో నిర్వహించిన 11వ విడత ఫివర్‌ సర్వే 96 శాతం పూర్తయినట్లు మండల వైద్యాధికారి ఎస్‌.శ్రీకళ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆదివారం మండలంలోని సర్వరాబాదు, మిట్టపల్లి, గడ్డంవారిపల్లి, దాసరుపల్లి, అప్పసముద్రం గ్రామాల్లో జరుగుతున్న సర్వేని పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే వెంగళరావునగర్‌, గండిపాళెం పంచాయతీల్లో ఫివర్‌ సర్వే కార్యక్రమాన్ని ఈవోపీఆర్డీ ఆదినారాయణ, పంచాయతీ కార్యదర్శి అమర్‌నాఽథ్‌రెడ్డి పరిశీలించారు. గండిపాళెం గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యశాలను సందర్శించి జ్వరంతో వచ్చేవారిని ప్రభుత్వ వైద్యశాలకు పంపాలన్నారు. కరోనా బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకుడు అక్బర్‌బాషా, వైద్యఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు, ఆశ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

సర్వే వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి : ఆర్డీవో

కలిగిరి : గ్రామాల్లో జ్వరాలకు సంబంధించిన సర్వే వివరాలను కచ్చితంగా నమోదుచేయాలని కావలి ఆర్డీవో శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని క్రిష్ణారెడ్డిపాలెంలో  జరుగుతున్న జ్వరపీడితుల వివరాల సేకరణ సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎమ్‌లు, ఆశాలు స్వయంగా ఇంటికి వచ్చి వివరాలు సేకరించారా అని పలువురిని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, వైద్యాధికారి బాలనాగేశ్వరరావు, వీఆర్‌ఏ సత్య, ఏఎన్‌ఎమ్‌లు, ఆశాలు, గ్రామ వలంటీర్లు పాల్గొన్నారు.

కొండాపురం : మండలంలోని ప్రతి ఇంటికి వెళ్లి తప్పకుండా ఫీవర్‌ సర్వే చేయాలని ఈవోపీఆర్‌డీ విజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం గుడవళ్లూరు పంచాయతీ సిబ్బంది చేస్తున్న సర్వేను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో పచివాలయ సిబ్బంది, ఆశా వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-05-31T04:05:58+05:30 IST