అర్హులందరికీ సాయం

ABN , First Publish Date - 2021-09-19T05:41:26+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ కార్పొరేషన్‌కు సంబంధించిన సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తామని ఆ కార్పొరేషన్‌ చైర్మన్‌ బొల్లవరపు జాన్‌వెస్లీ తెలిపారు. శనివారం నగరంలోని డౌనీహాలులో ఆలిండియా క్రిస్టియన్‌ ఫెడరేషన్‌, నెల్లూరు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యం లో వెస్లీ ఆత్మీయ సత్కార సమావేశం నిర్వహించారు.

అర్హులందరికీ సాయం
ఆత్మీయ సన్మానం అందుకుంటున్న క్రైస్తవ మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జాన్‌వెస్లీ

క్రైస్తవ మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జాన్‌వెస్లీ

నెల్లూరు (సాంస్కృతికం), సెప్టెంబరు 18 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ కార్పొరేషన్‌కు సంబంధించిన సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తామని ఆ కార్పొరేషన్‌ చైర్మన్‌ బొల్లవరపు జాన్‌వెస్లీ తెలిపారు. శనివారం నగరంలోని డౌనీహాలులో ఆలిండియా క్రిస్టియన్‌ ఫెడరేషన్‌, నెల్లూరు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యం లో వెస్లీ ఆత్మీయ సత్కార సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఆర్థిక సాయం అందిస్తామ న్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన ఆల్‌ఇండియా క్రిస్టియన్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు హృదయకుమార్‌ మాట్లాడుతూ ప్రతి జిల్లా, మండలంలో క్రైస్తవ కమ్యూనిటీ హాల్‌  అవసరం ఉందని, వాటి నిర్మాణానికి కృషి చేయాలని, శ్మశాన వాటికల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఆల్‌ఇండియా క్రిస్టియన్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎలీషాకుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని దళిత క్రిస్టియన్లకు ఎస్సీ, ఎస్టీ చట్టం ద్వారా రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్‌ను కోరారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలను పునః ప్రారంభింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నెల్లూరు బిషప్‌ డాక్టర్‌ ఎండీ ప్రకాశం, ఏఎంసీ చైర్మన్‌ ఏసునాయుడు, డేవిడ్‌ దయాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T05:41:26+05:30 IST