రైతులకు భరోసా కల్పించాలని నిరసన
ABN , First Publish Date - 2021-05-06T04:17:05+05:30 IST
రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు భరోసా కల్పించాలని రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య, కోడె రమణయ్యలు

సీతారామపురం, మే 5 : రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు భరోసా కల్పించాలని రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య, కోడె రమణయ్యలు డిమాండ్ చేశారు. వారు బుధవారం వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద పలువురు రైతులతో కలిసి నిరసన తెలిపారు. మెట్ట ప్రాంతంలోని రైతులు అప్పులు చేసి పసుపు, మొక్కజొన్న, వరి, సజ్జ పంటలు పండించినా నేటి వరకు ఒక్క క్వింటా కూడా కొనుగోలు చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా రైతుల పంటలను కొనుగోలు చేయాలని, లేకుంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.