అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-08-26T05:28:09+05:30 IST

మండల పరిధిలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి అయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాల ని విస్తరణాధికారి సీ శ్రీనివాసులు తెలిపారు.

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

ఆత్మకూరు, ఆగస్టు 25 : మండల పరిధిలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి అయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాల ని విస్తరణాధికారి సీ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం స్థానిక ఎంపీ డీవో కార్యాలయంలో సచివాలయ కార్యదర్శులతో సమావేశం నిర్వహించా రు. స్వామిత- భూహక్కు పథకంలో కొన్ని పంచాయతీలు డిజిటలీకరణ లో వెనుకబడ్డాయన్నారు. మండలంలోని 16 చెత్త సంపద కేంద్రాలకు పెయింటింగ్‌ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. 2020-21 ఆర్ధిక సంవత్సరం ఇంటి పన్నులు పూర్తిగా వసూలు చేయాలని తెలిపారు. జీవ వైవిధ్యానికి సంబంధించి ముగ్గురు కమిటీ సభ్యులతో వెంటనే బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలని పేర్కొన్నారు.

Updated Date - 2021-08-26T05:28:09+05:30 IST