ఘనంగా వాజ్‌పేయి జయంతి

ABN , First Publish Date - 2021-12-26T03:14:08+05:30 IST

భారత మాజీ ప్రధాని స్వర్గీయ అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి వేడుకలు శనివారం పట్టణ బీజేపీ అధ్యక్షుడు కె బ్రహ్మానందం అధ్యక్షతన ఘనంగా జరిగాయి.

ఘనంగా వాజ్‌పేయి జయంతి
కావలిటౌన్‌ : వాజపేయికి నివాళులర్పిస్తున్న కందుకూరి, తదితరులు

కావలిటౌన్‌, డిసెంబరు 25: భారత మాజీ ప్రధాని స్వర్గీయ అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి వేడుకలు శనివారం పట్టణ బీజేపీ అధ్యక్షుడు కె బ్రహ్మానందం అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కందుకూరి సత్యనారాయణ వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యమ్రంలో రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు రంగారెడ్డి, పూనూరు మాధవి, బాలు యాదవ్‌, సీవీసీ సత్యం, కామినేని ఉదయలక్ష్మి, పొన్నగంటి మురళి, మంద కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఉదయగిరి రూరల్‌ : స్థానిక బాలాజీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి 97వ జయంతి సందర్భంగా శనివారం బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆవుల రోశయ్యయాదవ్‌, గెట్టిబోయిన వెంకటేశ్వర్లు, చల్లా సుబ్బరత్నం, విష్ణువర్థన్‌రెడ్డి, వెంకటాద్రి, గుప్తా, బాలాజీ, ఖయ్యూం, టీ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.Updated Date - 2021-12-26T03:14:08+05:30 IST