ఇసుక, లిక్కర్‌ మాఫియాతో రాష్ట్రం అధోగతి

ABN , First Publish Date - 2021-07-13T03:20:48+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఇసుక, లిక్కర్‌ మాఫియాతో రాష్ట్రం అధోగతి పాలయ్యందని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు పేర్కొన్నారు.

ఇసుక, లిక్కర్‌ మాఫియాతో రాష్ట్రం అధోగతి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని

మాజీ ఎమ్మెల్యే బొల్లినేని

కలిగిరి, జూలై 12: వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఇసుక, లిక్కర్‌ మాఫియాతో రాష్ట్రం అధోగతి పాలయ్యందని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం టీడీపీ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లినేని మాట్లాడుతూ మాటతప్పను మడమ తిప్పను అంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటి వరకు చేసినవన్నీ మడమ తిప్పిన పనులేనన్నారు. రెండేళ్లు పూర్తయినా పెన్షన్‌ పెంచిన దాఖలాలు లేవన్నారు. రూ.5వేలకో, 10వేలకో ప్రజలను అలవాటు చేసి నిత్యావసర ధరల దగ్గర నుంచి పెట్రోల్‌ పన్నుల వరకు ఇష్టమొచ్చిన రీతిలో ధరలు పెంచి సామాన్య మానవుడు బతకలేని స్థితికి తెచ్చాడన్నారు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రవేఖర్‌రెడ్డి చేసింది శూన్యమన్నారు. అనంతరం 100 మంది కార్యకర్తలు, నాయకులకు తిరుమల లడ్డూ ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పమిడిరవికుమార్‌ చౌదరి, పీ చెంచలబాబు యాదవ్‌, వంటేరు జయచంద్రారెడ్డి, చల్లా వెంకటేశ్వర్లు, కాకు మహేష్‌ , సీహెచ్‌ జయరామిరెడ్డి, బీవీ రామారావు, బిజ్జం కృష్ణారెడ్డి, తాతయ్య, వేళ్ళ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-13T03:20:48+05:30 IST