ఏరియా ఆసుపత్రికి బీరువా వితరణ

ABN , First Publish Date - 2021-12-08T03:01:48+05:30 IST

స్థానిక ఏరియా ఆసుపత్రిలోని కంటివిభాగానికి మంగళవారం పీఎంపీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో విజయగోపాల్‌, వేణుగోపాల్‌

ఏరియా ఆసుపత్రికి బీరువా వితరణ
ఏరియా ఆసుపత్రికి బీరువాను అందజేసిన పీఎంపీ అసోసియేషన్‌ నాయకులు

గూడూరు, డిసెంబరు 7: స్థానిక ఏరియా ఆసుపత్రిలోని కంటివిభాగానికి  మంగళవారం పీఎంపీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో విజయగోపాల్‌, వేణుగోపాల్‌, శ్రీదేవిల దాతృత్వంతో బీరువాను వితరణ చేశారు. ఈ సంద ర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ పోగ్రామ్‌ మేనేజర్‌ డాక్టర్‌ మంజులమ్మ మాట్లాడుతూ పీఎంపీలు గ్రామాలలో ప్రాథమిక వైద్యసేవలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామకృష్ణ, డాక్టర్‌ హెలెన్‌, పీఎంపీ నాయకులు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సాయిమురళీ, చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.


ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో.. 


స్థానిక ఏరియా ఆసుపత్రికి మంగళవారం ఇన్నర్‌వీల్‌క్లబ్‌, ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో బీరువాను వితరణగా అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ రోహిణి, డాక్టర్‌ రామకృష్ణ, లక్ష్మీ, అనిత, విష్ణువందన, స్నేహలత, శశికళ, శైలజ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-08T03:01:48+05:30 IST