వాహన రిజిస్ట్రేషన్లలో అక్రమాలపై విచారణ

ABN , First Publish Date - 2021-12-29T03:34:34+05:30 IST

ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని ఏలూరు డీటీసీ సిరిఆనంద్‌ తెలిపారు.

వాహన రిజిస్ట్రేషన్లలో అక్రమాలపై విచారణ
రికార్డులు పరిశీలిస్తున్న ఏలూరు డీటీసీ సిరిఆనంద్‌

గూడూరు, డిసెంబరు 28: ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని ఏలూరు డీటీసీ సిరిఆనంద్‌ తెలిపారు. మంగళవారం స్థానిక రవాణాశాఖ కార్యాలయంలో  రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూళ్లూరుపేటలో  వాహనాల రిజిస్ట్రేషన్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయన్నారు. దీంతో రవాణాశాఖ కమిషనర్‌ తనను విచారణాధికారిగా నియమించారన్నారు. గగూఊరు రవాణాశాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో,  రికార్డులను తనిఖీ చేశామన్నారు. ఆర్టీవో మల్లికార్జున్‌రెడ్డిని విచారించామన్నారు.  కార్యక్రమంలో నెల్లూరు డీటీసీ చందర్‌, ఎంవీఐ మురళీమోహన్‌, ఏఎంవీఐ శేషురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-29T03:34:34+05:30 IST