ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-02-07T02:59:04+05:30 IST

పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి కోరారు. శని

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
:ప్రత్యేకాధికారిని కలిసిన టీడీపీ నాయకులు

ముత్తుకూరు, ఫిబ్రవరి6: పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి కోరారు. శనివారం ఆయన నాయకులతోపాటు మండల ప్రత్యేకాధికారిని కలిశారు. నామినేషన్లను నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నామినేషన్ల ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దారు సోమ్లానాయక్‌ను కలసి కుల ధ్రువీకరణ పత్రాల మంజూరు త్వరగా చేయాలని కోరారు. ఈ విషయంపై తహసీల్దారు స్పందిస్తూ, అన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసిన గంటలోగా సర్టిఫికెట్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నీలం మల్లికార్జునయాదవ్‌, మండల తెలుగుయువత అధ్యక్షుడు ఈపూరు మునిరెడ్డి, నాయకులు ఏకొల్లు కోదండయ్య, కొత్తపల్లి రమేష్‌, మాచిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అక్కంగారి ఏడుకొండలు, పల్లంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-07T02:59:04+05:30 IST