ఇళ్ల పట్టాల పంపిణీ

ABN , First Publish Date - 2021-12-31T03:50:56+05:30 IST

మండల పరిధిలో 178 మంది పేదలకు గురువారం ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పంపిణీ

ఇళ్ల పట్టాల పంపిణీ
ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ప్రసన్న

 కోవూరు,డిసెంబరు30 : మండల పరిధిలో 178 మంది పేదలకు గురువారం ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పంపిణీ చేశారు. తహసీల్దారు కార్యాలయ ఆవరణలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదలు ఇళ్లపట్టాల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం సచివాలయ సిబ్బందికి యూనిఫాం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా వ్యవసాయ సలహామండలి చైౖర్మన్‌ దొడ్డంరెడ్డి నిరంజనబాబురెడ్డి, ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి, జడ్పీటీసీ కవరగిరి శ్రీలత, ఉపాధ్యక్షుడు శివుని నరసింహులురెడ్డి, పడుగుపాడు సొసైటీ చైర్మన్‌ రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి తహసీల్దారు సీహెచ్‌ సుబ్బయ్య, ఎంపీడీవో శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T03:50:56+05:30 IST