విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2021-12-29T03:48:22+05:30 IST

మండలంలోని తిక్కవరం గ్రామంలో మంగళవారం ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి
మస్తానయ్య మృతదేహం

మరిప్రాడు, డిసెంబర్‌ 28 : మండలంలోని తిక్కవరం గ్రామంలో మంగళవారం ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు... గ్రామానికి చెందిన రైతు శాఖమూరి మస్తానయ్య (45) తన పొగాకు బ్యార్నీ వద్ద పనిచేసే కూలీలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించేందుకు వైర్లు తగిలిస్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడుకి భార్య సుజాత, కుమారుడు మనోజ్‌ ఉన్నారు. 


Updated Date - 2021-12-29T03:48:22+05:30 IST