ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు విధులు

ABN , First Publish Date - 2021-02-07T03:02:21+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడి మండలంలో ఎన్నికల అధికారులు పనిచేయాలని జోనల్‌, రూట్‌, మొదటి శ్రేణి

ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు విధులు
: ఎన్నికలపై ప్రత్యేకాధికారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మండల అధికారులు

బుచ్చిరెడ్డిపాళెం,ఫిబ్రవరి6: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడి మండలంలో  ఎన్నికల అధికారులు పనిచేయాలని జోనల్‌, రూట్‌, మొదటి శ్రేణి ఎన్నికల అధికారులతో మండల ప్రత్యేకాధికారి కోటేశ్వరరావు అన్నారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రత్యేకాధికారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న తహసీల్దారు షఫీమాలిక్‌,  ఎంపీడీవో నరసింహరావు, ఎంఈవో దిలీప్‌కుమార్‌ ఏఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఎన్నికల అధికారులకు మండలంలోని మొత్తం 13 పంచాయతీలలో  140 పోలింగ్‌ స్టేషన్లు, 6 నామినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


Updated Date - 2021-02-07T03:02:21+05:30 IST