స్థానికుల సహకారంతో వానపాముల రవాణాకు అడ్డుకట్ట

ABN , First Publish Date - 2021-08-26T04:13:35+05:30 IST

పులికాట్‌ సరస్సు నుంచి జరుగుతున్న వానపాముల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు స్థానికుల సహకారం తీసుకుంటామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య తెలిపారు.

స్థానికుల సహకారంతో వానపాముల రవాణాకు అడ్డుకట్ట


25తడ2: సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిలివేటి

ఎమ్మెల్యే కిలివేటి

తడ, ఆగస్టు 25: పులికాట్‌ సరస్సు నుంచి జరుగుతున్న వానపాముల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు స్థానికుల సహకారం తీసుకుంటామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య తెలిపారు. మండలంలోని తడ కొత్తకుప్పం, భీముల వారిపాళెం కుప్పాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులతో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం పలువురు దాతల సాయం కోరుతున్నామన్నారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు. పలువురు మత్స్యకారులు వానపాముల అక్రమ రవాణా విషయమై ఎమ్మెల్యేకు వివరించగా అరికడతామని హామీ ఇచ్చారు.  వైసీపీ నాయకులు కె.రఘురెడ్డి, ఉచ్చూరు మునుస్వామిరెడ్డి, సర్పంచులు ఆర్ముగం, జ్యోతిప్రకాష్‌, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-26T04:13:35+05:30 IST