జిల్లాలో 10 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-08-21T04:26:17+05:30 IST

జిల్లాలో ఈ నెలాఖరుకు 10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించామని డ్వామా పీడీ తిరుపతయ్య పేర్కొన్నా రు. శుక్రవారం ఆయన స్థానిక

జిల్లాలో 10 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

సంగం, ఆగస్టు 20: జిల్లాలో ఈ నెలాఖరుకు 10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించామని డ్వామా పీడీ తిరుపతయ్య పేర్కొన్నా రు. శుక్రవారం ఆయన స్థానిక ఉపాధి హామి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పథకంలో ఆగస్టు 15 నాటికి జిల్లాలో కోటి పని దినాలు పూర్తయిందన్నారు. ఇందుకుగాను కూలీల ఖాతాలకు కూలి కింద రూ.240 కోట్ల జమ చేయడం జరిగిందన్నారు. దీంతో జిల్లాకు రూ. 160 కోట్లు కాంపోనెంట్‌  నిధులు మంజూరవుతాయని తెలిపారు. ఈ నెలాఖరకు జిల్లా వ్యాప్తంగా 10 లక్షల మొక్కలు నాటాలని ప్రణాళికలు సిద్ధం చేసి పనులు జోరుగా జరుగుతున్నాయన్నారు. అయితే జిల్లాలో జరిగిన ఉపాధి హామి పనులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన అధికారు ల బృందం గ్రామాల్లో పర్యటించి పరిశీలిస్తున్నారని తెలిపారు. ఆయన వెంట ఏపీవో శ్రీనివాసరావు, టెక్నికల్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉన్నారు.

Updated Date - 2021-08-21T04:26:17+05:30 IST