చెత్త బుట్టల పంపిణీ

ABN , First Publish Date - 2021-06-22T04:30:01+05:30 IST

మండలంలోని పెరమనలో స్వచ్ఛ సంకల్పంలో భాగంగా సోమవారం సర్పంచు రమణమ్మ ఆధ్వర్యంలో ఇంటింటికీ చెత్త బుట్టలను పంపిణీ చేశారు.

చెత్త బుట్టల పంపిణీ

సంగం, జూన్‌ 21: మండలంలోని పెరమనలో స్వచ్ఛ సంకల్పంలో భాగంగా సోమవారం సర్పంచు రమణమ్మ ఆధ్వర్యంలో ఇంటింటికీ చెత్త బుట్టలను పంపిణీ చేశారు. గ్రామంలోని 500 కుటుంబాలకు ఒక్కొక్కరికి తడి, పొడి చెత్తలను వేరువేరుగా స్వీకరించేందుకు రెండేసి బుట్టలను పంపిణీ చేశారు. అనంతరం సచివాలయ కార్యాలయంలో పంచాయతీ తొలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచు మల్లిఖార్జున యాదవ్‌, వార్డు సభ్యులు వెంకటేశ్వర్లు యాదవ్‌, గోపాల్‌రెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T04:30:01+05:30 IST