దుకాణదారులకు ‘ఈ పాస్‌ ’ జరిమానా

ABN , First Publish Date - 2021-07-13T05:22:20+05:30 IST

రోడ్లపై చెత్త వేస్తున్న దుకాణదారులపై నగర పాలక సంస్థ అధికారులు కొరడ ఝుళిపిస్తున్నారు.

దుకాణదారులకు ‘ఈ పాస్‌ ’ జరిమానా
ఈపాసు యంత్రంతో జరిమానా వేస్తున్న కార్పొరేషన్‌ అధికారులు

రోడ్లపై చెత్త నివారణకు 20 బృందాలు 


నెల్లూరు (సిటీ), జూలై 12 : రోడ్లపై చెత్త వేస్తున్న దుకాణదారులపై నగర పాలక సంస్థ అధికారులు కొరడ ఝుళిపిస్తున్నారు. నెల్లూరు నగర వ్యాప్తంగా వాణిజ్య ప్రాంతాలలో 20 బృందాలను ఏర్పాటు చేసిన పారిశుధ్య విభాగం అధికారులు దుకాణాల ముందు డస్ట్‌బిన్లు లేకపోవడం, రోడ్లపై చెత్త వేస్తున్న యజమానులపై జరిమానా సిద్ధమవుతున్నారు. సోమవారం ఈ ప్రక్రియ మొదలుపెట్టినట్లు ఎంహెచ్‌వో వెంకటరమణయ్య తెలిపారు. తొలిసారిగా జీఎన్‌టీ రోడ్లు పైనున్న దుకాణదారులకు రూ.20 వేలు వరకు జరిమానా విధించినట్లు తెలిపారు. దుకాణం పేరు, యజమాని,  ఫోన్‌ నెంబరు సహా వివరాలు జోడించి జరిమానా అప్‌లోడ్‌ చేసిన వెంటనే సంబంధిత వ్యక్తి ఫోన్‌కు జరిమానా వివరాలు మెసేజ్‌ రూపంలో వెళుతుందన్నారు.  


Updated Date - 2021-07-13T05:22:20+05:30 IST