సిబ్బంది పనితీరు భేష్‌ : డీఎస్పీ

ABN , First Publish Date - 2022-01-01T04:43:45+05:30 IST

మండలంలో పోలీస్‌ సిబ్బంది పనితీరు చాలా బాగుందని కావలి డీఎస్పీ ప్రసాద్‌ కతాబిచ్చారు. శుక్రవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సిబ్బంది పనితీరు భేష్‌ : డీఎస్పీ
రికార్డులు పరిశీలిస్తున్న డీఎస్పీ ప్రసాద్‌

వరికుంటపాడు, డిసెంబరు 31: మండలంలో పోలీస్‌ సిబ్బంది పనితీరు చాలా బాగుందని కావలి డీఎస్పీ ప్రసాద్‌ కతాబిచ్చారు. శుక్రవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు శాంతి భద్రతలు పక్కాగా అమలవుతున్నాయన్నారు. ఉదయగిరి సీఐ గిరిబాబు, ఎస్సై బాలమహేంద్రనాయక్‌లు సమన్వయంతో పనిచేసి వీలైనంత త్వరితగతిన కేసులను పరిష్కరించడంలో సాధిస్తున్న పురోగతి ఎంతో అభినందనీయమని కొనియాడారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి మెరుగైన సేవలు అందించాలన్నారు. అనంతరం సంబంధిత రికార్డులు పరిశీలించి తగు సూచనలు, సలహాలు అందచేశారు. కార్యక్రమంలో సీఐ గిరిబాబు, ఎస్సై బాలమహేంద్రనాయక్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-01T04:43:45+05:30 IST