పోలీసులు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-02-13T04:54:44+05:30 IST

మండలంలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమ త్తంగా వ్యవహరించాలని నెల్లూరు డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు.

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
ఎస్‌ఐలకు సూచనలు ఇస్తున్న డీఎస్పీ గోపాలకృష్ణ

అనంతసాగరం, ఫిబ్రవరి 12: మండలంలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమ త్తంగా వ్యవహరించాలని నెల్లూరు డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. అనంత సాగరం పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐలతో శుక్రవారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. చిన్నపా టి ఘటన కూడా జరగకుండా సిబ్బంది విధులు నిర్వహిం చాలని సూచించారు. అనంతరం పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.

Updated Date - 2021-02-13T04:54:44+05:30 IST