భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-06-23T03:27:49+05:30 IST

పలు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని డీపీవో ధనలక్ష్మి, డ్వామా పీడీ తిరుపతయ్య పేర్కొన్నారు.

భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి
చెత్త నుంచి సంపద కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీపీవో ధనలక్ష్మి

డీపీవో ధనలక్ష్మి

ఆత్మకూరు, జూన్‌ 22: పలు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని డీపీవో ధనలక్ష్మి, డ్వామా పీడీ తిరుపతయ్య పేర్కొన్నారు. మంగళవారం వారు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అధికారుతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు త్వరితగతిన మంజూరవుతాయని, పనులు వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం డీపీవో ధనలక్ష్మి మండలంలోని కరటంపాడులో నిర్మించిన చెత్త నుంచి సంపద కేంద్రాన్ని పరిశీలించారు. ఇక్కడ తయారు చేసిన సేంద్రియ ఎరువులను రైతులకు విక్రయించాలని సూచించారు. చెత్త సేకరణకు ఉచితంగా ట్రాక్టర్‌ను అందజేసిన గార్లపాటి ఫౌండేషన్‌ చైర్మన్‌ గార్లపాటి వేణుగోపాల్‌ నాయుడును అభినందించారు. ఈ కార్యక్రమాలలో ఎంపీడీవో కే.రాఘవేంద్ర, మండల విస్తరణాధికారి సీ శ్రీనివాసులు, వీఆర్వో ప్రతాప్‌, పంచాయతీ కార్యదర్శి అంకయ్య, ప్రసాదు, సచివాలయ కార్యదర్శులు, అసిస్టెంట్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T03:27:49+05:30 IST