చెంగాళమ్మను దర్శించుకున్న డీపీవో
ABN , First Publish Date - 2021-02-27T04:06:53+05:30 IST
జిల్లా పంచాయతీ అధికారి ఎం. ధనలక్ష్మి శుక్రవారం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మను దర్శించుకున్నారు.

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 26 : జిల్లా పంచాయతీ అధికారి ఎం. ధనలక్ష్మి శుక్రవారం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి స్వాగతించారు. దర్శన అనంతరం ఆలయ ఆనవాయితీ మేరకు వేదపండితులచే ఆశీర్వచనం చేయించి అమ్మణ్ణి ప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట స్థానిక ఎండీవో నర్మద, మున్సిపల్ కమిషనర్ నరేంద్రకుమార్ ఉన్నారు.