గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-07-13T03:23:40+05:30 IST

మంజూరైన పక్కాగృహ నిర్మాణాలు సత్వరమే పూర్తి చేసేలా అధికారులు పనిచేయాలని డ్వామా పీడీ తిరుపతయ్య అన్నారు.

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి
సమీక్షిస్తున్న డ్వామా పీడీ తిరుపతయ్య

డ్వామా పీడీ తిరుపతయ్య

బిట్రగుంట, జూలై 12: మంజూరైన పక్కాగృహ నిర్మాణాలు సత్వరమే పూర్తి చేసేలా అధికారులు పనిచేయాలని డ్వామా పీడీ తిరుపతయ్య అన్నారు. బోగోలు మండల ప్రజాపరిషత్‌ సమావేశ భవనంలో ఎంపీడీవో నాసరరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మండల, గ్రామ రెవెన్యూ, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కోవూరుపల్లి, కడనూతల గ్రామాల్లో జరుగుతున్న గ్రౌడింగ్‌ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు బాలమురళీకృష్ణ, హౌసింగ్‌ ఏఈ వెంకటయ్య, ఎంఈవో జయింత్‌బాబు, ఆర్‌డబ్యూఏఈ రవీంద్రనాధ్‌, పీఆర్‌ఏఈ శ్రీనివాసులు కార్యదర్శులు, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-13T03:23:40+05:30 IST