రక్షణ పరికరాలు అందించాలని ధర్నా

ABN , First Publish Date - 2021-05-31T03:48:01+05:30 IST

తమకు రక్షణ పరికర లను అందించడంతో పాటు వారికి మెరుగైన వైద్యం ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపాలిటీలోని పారిశుధ్య కార్మికులకు ఆదివారం పట్టణంలోని దర్గా సెంటర్‌ వద్ద సీఐటీయూ నాయకులతో కలిసి ధర్నా చేశారు.

రక్షణ పరికరాలు అందించాలని ధర్నా
దర్గా సెంటర్‌ వద్ద ధర్నా చేస్తున్న పారిశుధ్య కార్మికులు, సీఐటీయూ నాయకులు

నాయుడుపేట, మే 30 : తమకు రక్షణ పరికర లను అందించడంతో పాటు వారికి మెరుగైన వైద్యం ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపాలిటీలోని పారిశుధ్య కార్మికులకు ఆదివారం పట్టణంలోని దర్గా సెంటర్‌ వద్ద సీఐటీయూ నాయకులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి ముకుందా మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు హెల్త్‌ అలెవెన్స్‌ బకాయిలు చెల్లించాలన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేయడంతో పాటు ఇంజనీరింగ్‌ శాఖలో పనిచేసే కార్మికులకు జీతాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కార్మికులు రవీంద్ర, సురేష్‌, చెంగయ్య, శీనయ్య, సుబ్రహ్మణ్యం, ఆరావళి, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-31T03:48:01+05:30 IST