భూ ఆక్రమణ అడ్డగింత

ABN , First Publish Date - 2021-10-30T03:20:24+05:30 IST

మండలంలోని ధర్మవరంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి పనులు చేస్తుండగా శుక్రవారం గ్రామస్థులు అడ్డుకున్నారు.

భూ ఆక్రమణ అడ్డగింత
ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

వరికుంటపాడు, అక్టోబరు 29: మండలంలోని ధర్మవరంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి పనులు చేస్తుండగా శుక్రవారం గ్రామస్థులు అడ్డుకున్నారు. వివరాల మేరకు.. గ్రామంలో 128, 129 సర్వే నెంబర్లలోని 4 ఎకరాల ప్రభుత్వ అనాధీనం భూమి ఉంది. ఆ భూమి తనదంటూ  సమీపంలోని నార్త్‌కొండాయపాళెంకు చెందిన ఓ వ్యక్తి రెండు రోజులుగా సాగుకు సిద్ధం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు మూకుమ్మడిగా వెళ్లి పనులను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. గతంలోనూ పలుమార్లు ఇలాగా వ్యవహరిస్తే అడ్డుకున్నా ఆ రైతులో మార్పు రాకపోవడం ఏమిటని మండిపడ్డారు. అతనికి ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని వదిలి మా గ్రామానికి చెందిన భూమి తనదంటూ వ్యవహరిస్తుండడం దారుణమన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళన వివరించాలని సూచించారు. అక్కడి నుంచి గ్రామస్థులు తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి తహసీల్దారు హేమంత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2021-10-30T03:20:24+05:30 IST