ధరలు తగ్గించాలని వామపక్షాల ఆందోళన

ABN , First Publish Date - 2021-10-29T02:30:26+05:30 IST

వామపక్ష పార్టీల పిలుపు మేరకు పెరిగి పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గించాలని గురువారం బ్రిడ్జి

ధరలు తగ్గించాలని వామపక్షాల ఆందోళన
బ్రిడ్జి కూడలిలో ఽఆందోళన చేస్తున్న వామపక్షాలు

కావలిటౌన్‌, అక్టోబరు28: వామపక్ష పార్టీల పిలుపు మేరకు పెరిగి పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గించాలని గురువారం బ్రిడ్జి కూడలిలో ఆందోళన నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండవసారి అధికారంలోకొచ్చి విపరీతంగా ధరలు పెంచేసిందని, పేదలు సామాన్య ప్రజలు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.  పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి పి పెంచలయ్య, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమొక్రసీ నేత కరవది భాస్కర్‌, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి డేగా సత్యనారాయణ, స్త్రీ విముక్తి సంఘటన నేత శ్యామల,  లక్షీరెడ్డి, పోలయ్య, మాలకొండయ్య, రవి, జేమ్స్‌ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-10-29T02:30:26+05:30 IST