ప్రధాని నరేంద్రమోదీతో దేశాభివృద్ధి

ABN , First Publish Date - 2021-05-31T03:02:20+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ సారఽథ్యంలో భారతదేశం అభివృద్ధిపథంలో సాగుతోందని బీజేపీ నాయకుడు సురేంద్ర అన్నారు.

ప్రధాని నరేంద్రమోదీతో దేశాభివృద్ధి
పేదలకు దుస్తులు, మాస్కులు అందజేస్తున్న బీజేపీ నాయకులు

గూడూరురూరల్‌, మే 30: ప్రధాని నరేంద్రమోదీ సారఽథ్యంలో భారతదేశం అభివృద్ధిపథంలో సాగుతోందని బీజేపీ నాయకుడు సురేంద్ర అన్నారు. ఆదివారం చెన్నూరులో ప్రధానిమంత్రిగా నరేంద్రమోదీ 7 ఏళ్లు పరిపాలన పూర్తిచేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు, మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బైరప్ప, గాలి ప్రకాష్‌నాయుడు, ఇండ్ల హేమచంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నాయకులు ఆరికట్ల బాలకృష్ణమనాయుడు, బిందురెడ్డి ఆధ్వర్యంలో పేదలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. 

Updated Date - 2021-05-31T03:02:20+05:30 IST