వాహనం ఢీకొని మహిళ మృతి

ABN , First Publish Date - 2021-05-06T04:04:21+05:30 IST

గుర్తుతెలియని వాహనం ఢీకొని షేక్‌ బీబి(46) మృతిచెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున కావలి ఆర్‌అండ్‌బీ బంగ్లా సమీపంలో జరిగింది.

వాహనం ఢీకొని మహిళ మృతి

కావలి రూరల్‌, మే 5: గుర్తుతెలియని వాహనం ఢీకొని షేక్‌ బీబి(46) మృతిచెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున కావలి ఆర్‌అండ్‌బీ బంగ్లా సమీపంలో జరిగింది.  తుఫాన్‌నగర్‌కు చెందిన షేక్‌ ఖాజావలి, ఆయన భార్య బీబి ఆర్‌అండ్‌బీ బంగ్లా సమీపం లోని పండ్ల దుకాణాల వద్ద రాత్రి సమయాల్లో కాపలా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే ఆర్‌అండ్‌బీ సమీపంలో ట్రంక్‌ రోడ్డు పక్కన వేర్వేరు దుకాణాల వద్ద కాపలా గా మంగళవారం రాత్రి పడుకున్నారు. తెల్లవారుజామున ఖాజావలి కాపలా ఉన్న దుకాణం వద్దకు ఆవులు రావటంతో వాటిని తరిమి సమీపంలో నిద్రిస్తున్న భార్య దగ్గరకు వెళ్లాడు. అయితే మంచం విరిగి ఉండటంతో పాటు బీబి మృతిచెంది ఉండటాన్ని గుర్తించాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఉంటుందని భావిస్తున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కొండయ్య కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-06T04:04:21+05:30 IST