సకాలంలో డయాలసిస్‌ అందక మహిళ మృతి

ABN , First Publish Date - 2021-05-03T03:56:09+05:30 IST

: సకాలంలో డయాలసిస్‌ సేవలు అందక పోవడంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆదివారం వేకువన ఓ మహిళ మృతిచెందింది. స్థానికుల కథనం మేరకు..

సకాలంలో డయాలసిస్‌ అందక మహిళ మృతి

గూడూరురూరల్‌, మే2: సకాలంలో డయాలసిస్‌ సేవలు అందక పోవడంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆదివారం వేకువన ఓ మహిళ మృతిచెందింది. స్థానికుల కథనం మేరకు.. స్థానిక గాంధీనగర్‌కు చెందిన మహిళ (42) ఏడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్‌ చేయిం చుకుంటున్నది. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ఆమెకు కరోనా సో కింది. దీంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో కొవిడ్‌కు చికిత్స పొందుతుంది. ఏరియా ఆసుపత్రిలో డయాలిసిస్‌ కేంద్రానికి వారి కుటుంబ సభ్యులు శనివారం తీసుకువెళ్లగా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆమె కు టుంబసభ్యులు విషయాన్ని సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు.  ఆమెకు కొవిడ్‌ నిబంధనలను అనుసరించి డయాలసిస్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని సబ్‌కలెక్టర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామకృష్ణను సూచించారు. దీంతో డాక్టర్‌ రామకృష్ణ డయాలసిస్‌ సిబ్బందికి కొవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ చికిత్స చేయాలని ఆదేశించారు. సిబ్బంది డయాలసిస్‌ చేయడంలో జాప్యం జరగడంతో  ఆ మహిళ మృతిచెందింది. కొవిడ్‌ సోకిన డయాలిసిస్‌ బాధితులకు ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేసి వైద్య సేవలు లందించాలని పలువురు కోరుతున్నారు.  


Updated Date - 2021-05-03T03:56:09+05:30 IST