12వ రోజుకు కర్ఫ్యూ
ABN , First Publish Date - 2021-05-17T04:33:45+05:30 IST
కొవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఈనెల 5 నుంచి అమలుచేస్తున్న కర్ఫ్యూ ఆదివారానికి 12వ రోజుకు చేరుకుంది.
16 జీడీఆర్ 2: నిర్మానుష్యంగా ఉన్న పాతబస్టాండు
గూడూరురూరల్, మే 16: కొవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఈనెల 5 నుంచి అమలుచేస్తున్న కర్ఫ్యూ ఆదివారానికి 12వ రోజుకు చేరుకుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతులు ఇచ్చారు. 12గంటల అనంతరం మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ విధించడంతో అన్ని దుకాణాలను మూసివేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను నిలిపివేయడంతో ప్రధాన రహదారులు జనసంచారం లేకుండా బోసిపోతున్నాయి. రోడ్లుపై ఎవరు అనవసరంగా తిరగకుండా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.