కర్ఫ్యూ అమలుకు ఏర్పాట్లు
ABN , First Publish Date - 2021-05-06T03:24:06+05:30 IST
కరోనా కర్ఫ్యూ అమలుకు సూళ్లూరుపేటలో అధికారులు ఏర్పాట్లు చేశారు. బజారువీధుల్లో మున్సిపాలిటీ సిబ్బంది బారికేడ్లు ఏర్పాటు చేశారు.

సూళ్లూరుపేట, మే 5 : కరోనా కర్ఫ్యూ అమలుకు సూళ్లూరుపేటలో అధికారులు ఏర్పాట్లు చేశారు. బజారువీధుల్లో మున్సిపాలిటీ సిబ్బంది బారికేడ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్ని దుకాణాలు మూసివేశారు. పోలీసులు ఓ వైపు సైరన్ మోగిస్తూ పోలీసు జీపు తిరుగుతున్నా, జన సంచారం కన్పించింది. సాయంత్రం 6 గంటల సమయంలో హేచరీల బస్సులు రావడంతో, ఉద్యోగులు దిగి నివాసాలకు వెళ్లడం కనిపించింది. చెంగాళమ్మ ఆలయం సైతం మధ్యాహ్నం నుండి భక్తులు లేక నిర్మానుష్యంగా మారింది
