టిడ్కో ఇళ్లు ఇవ్వకుంటే గృహ ప్రవేశం చేయిస్తాం

ABN , First Publish Date - 2021-10-26T04:51:26+05:30 IST

ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో ఆత్మకూరు మున్సిపా లిటీలో నిర్మించిన టిడ్కో పక్కాగృహాలను

టిడ్కో ఇళ్లు ఇవ్వకుంటే గృహ ప్రవేశం చేయిస్తాం

  సీపీఎం ఆధ్వర్యంలో నిరసన

ఆత్మకూరు, అక్టోబరు 25 : ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో ఆత్మకూరు మున్సిపా లిటీలో నిర్మించిన టిడ్కో పక్కాగృహాలను లబ్ధిదారులకు కేటాయించా లని సీపీఎం పట్టణ కార్యదర్శి డేవిడ్‌రాజు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ షేక్‌ సందాని డిమాండ్‌ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో పలువురు లబ్ధిదారులు సోమవారం మా ఇంటి కోసం.. మా పోరాటం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల దగ్గర డబ్బులు కట్టించుకుంది అధికారులే కాబట్టి ఇళ్లు కేటాయించే బాధ్యత కమిషనర్‌దేనని పట్టుబట్టారు. 1056 మంది లబ్ధిదారుల్లో 500 మందికి బ్యాంకులు రుణం మంజూరు చేశాయన్నారు. దాంతో బ్యాంకర్లు నెలవారీ ఈఎం ఐలను చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  అద్దె గృహాల్లో ఉండే పేద ప్రజలు సొంతింటి కల సాకారమై ఉంటే వారు చెల్లించే నెలసరి ఇంటి అద్దెను బ్యాంకులకు ఈఎంఐ రూపంలో చెల్లించేవారన్నారు. వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వ డం లేదని ప్రశ్నించారు. ఇళ్ల కేటాయించలేకపోతే మూడేళ్ల క్రితం లబ్ధిదారులు చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వాలని పట్టుబట్టారు.   పేద ప్రజలకు న్యాయం చేకూర్చేందుకు పోలీసుల అరెస్ట్‌లకు, కేసులకు భయపడబోమన్నారు. 1056 మంది లబ్దిదారులచే మూకు మ్మడిగా గృహప్రవేశం చేయించాల్సి వస్తుస్తామని పేర్కొన్నారు. ఈ మేర వారు మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో సంప్రదించి నవంబరు నెలాఖరు లోపు ఇళ్లు కేటాయిస్తామని కమిషనర్‌ హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు గంటా లక్ష్మీపతి, లక్కు కృష్ణప్రసాద్‌, ఆత్మకూరు నాగయ్య, నాగేంద్ర, వాగాల శ్రీహరి, ఆవాజ్‌, ఐద్వా నాయకులు పి.యస్ధాన్‌, సాలార్‌, షేక్‌ గుల్జార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T04:51:26+05:30 IST