ఘనంగా సీపీఐ వ్యవస్థాపక దినోత్సవం

ABN , First Publish Date - 2021-12-27T04:52:21+05:30 IST

సీపీఐ 97వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పట్టణంలోని పీఆర్‌ఆర్‌ కూడలిలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సీపీఐ వ్యవస్థాపక దినోత్సవం
కోవూరులో సీపీఐ పతాకావిష్కరణ

కోవూరు, డిసెంబరు 26: సీపీఐ 97వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పట్టణంలోని పీఆర్‌ఆర్‌ కూడలిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని జిల్లా సమితి కార్యదర్శి సీహెచ్‌.ప్రభాకర్‌ ఆవిష్కరించారు. తాలూకాఫీసు కూడలిలో జిల్లా నాయకుడు వీ రామరాజు ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ మాట్లాడుతూ సీపీఐ ఆధ్వర్యంలో కార్మికులు, కర్షకుల కోసం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాల్సిందిగా కోరారు. కార్యక్రమాల్లో సీపీఐ నాయకులు మున్వర్‌, వెంకటేశ్వర్లు, ఎస్థానీ, విజయకుమార్‌, శంకర్‌, షేక్‌ బాబు, ప్రశాంత్‌, హన్ను, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-27T04:52:21+05:30 IST